బెజవాడలో 'సరైనోడు'... ఉఫ్ ఉఫ్ అనుకుంటూ రకుల్-కేథరిన్ మధ్య బన్నీ...
బాబోయ్... ఈ బెజవాడలో ఎండలు ఏంటి... ఇక్కడ ఎండలు హాటే... యూత్ హాటే... అంటూ బన్నీ ఇబ్బందిపడిపోయాడు. విజయవాడలో సరైనోడు మూవీ విజయోత్సవంలో బన్నీ ఎందుకో చాలా అసహనంగా ఫీల్ అయ్యాడు. ఒకపక్క ఉక్కపోత... మరోపక్క ఏర్పాట్లలో నిర్వాహకుల వైఫల్
బాబోయ్... ఈ బెజవాడలో ఎండలు ఏంటి... ఇక్కడ ఎండలు హాటే... యూత్ హాటే... అంటూ బన్నీ ఇబ్బందిపడిపోయాడు. విజయవాడలో సరైనోడు మూవీ విజయోత్సవంలో బన్నీ ఎందుకో చాలా అసహనంగా ఫీల్ అయ్యాడు. ఒకపక్క ఉక్కపోత... మరోపక్క ఏర్పాట్లలో నిర్వాహకుల వైఫల్యం అల్లు అర్జున్‌ని ఇబ్బంది పెట్టింది. విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్‌లో సరైనోడు ఫంక్షన్ ఘనంగా జరిగింది. చిత్ర నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బోయపాటి శ్రీను, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మే నెలలో మండుటెండ కాచాక... సాయంత్రం ఇద్దరు హీరోయిన్లు రకుల్ ప్రీతి సింగ్, కేథరిన్‌ల మధ్య ఉక్కపోతతో ఉఫ్ ఉఫ్ అంటూ బన్నీ ప్రోగ్రాం వేడిని భరించాడు. అక్కడికీ బన్నీ పలుచటి కాటన్ చొక్కా క్యాజువల్‌గా వేసుకువచ్చాడు. ఐనా చమటలకు చిరాకనిపించింది మన హీరోకి. ఇక గ్రౌండ్లో సరైన సీటింగ్ లేకపోవడంతో, ప్రేక్షకులు, అభిమానుల తొక్కిసలాట అసహనాన్ని కలిగించింది.
అయినా, భారీ సంఖ్యలో వచ్చిన అభిమానుల్ని చూసి, బన్నీ అంత ఉక్కలోనూ ఉబ్బితబ్బిబయ్యాడు. బెజవాడ హాట్... ఇక్కడి యూత్ హాట్ అంటూ.. ఏంటో ఇక్కడ మాట్లాడాలంటే టెన్షన్ వచ్చేస్తోందని స్పీచ్ స్టార్ట్ చేశాడు. నన్ను ఊర మాస్‌గా చూపించిన బోయపాటి శ్రీనుకు అభినందనలని తెలిపాడు. తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్... కేథరిన్ మా ఎమ్మెల్యే అంటూ... ఈమెతోనే వరుసగా మూడు సినిమాలు చేశా. ఇంతవరకూ ఎవరితోనూ చేయలేదన్నాడు బన్నీ. మరో పక్కన ఉన్న రకుల్ ప్రీతి సింగ్ కూడా తనకు ఇష్టమే అని, తనలోని దేశభక్తి తనను ఎంతో ఆకట్టుకుందన్నారు.
రూపాయిన్నరకి మూడు రూపాయలు పిండేశారు... డాడీ!
నాకు డాడీగా కాదు... ఒక నిర్మాతగా అల్లు అరవింద్ గారిని అభినందిస్తున్నా అన్నాడు బన్నీ. మామూలుగా ప్రొడక్షన్లో రూపాయికి రూపాయే ఖర్చు పెట్టే డాడీ... తన సినిమాకి రూపాయికి రూపాయిన్నర ఖర్చు చేశారని... ఇదేంటి డాడీ ఇంత ఎందుకు ఖర్చు చేస్తున్నావంటే... మూడు రూపాయలు సంపాదించేస్తా అనే ధీమాతోనే డబ్బు పెడుతున్నా అన్నారని నిర్మాత డాడీ... అల్లు అరవింద్‌ని కొనియాడారు.