శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 6 మార్చి 2018 (22:00 IST)

శ‌ర్వానంద్-సాయి పల్లవిల 'పడి పడి లేచే మనసు'

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, శ‌త‌మానం భ‌వ‌తి, మ‌హానుభావుడు... ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతోన్న స‌క్స‌స్‌ఫుల్ హీరో శ‌ర్వానంద్. ఈరోజు శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా శ‌ర్వా తాజా చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసార

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, శ‌త‌మానం భ‌వ‌తి, మ‌హానుభావుడు... ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతోన్న స‌క్స‌స్‌ఫుల్ హీరో శ‌ర్వానంద్. ఈరోజు శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా శ‌ర్వా తాజా చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి 'ప‌డిప‌డి లేచే మ‌న‌సు' అనే టైటిల్ పెట్టారు. 
 
శ‌ర్వానంద్ కెరీర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని విధంగా మ‌ళ్లీమ‌ళ్లీ ఇదిరాని రోజు అనే క‌వితాత్మ‌కంగా ఉండే టైటిల్ ఉన్న విష‌యం తెలిసిందే. 
 
ఇప్పుడు తాజా చిత్రానికి కూడా అలాగే క‌వితాత్మ‌కంగా పడి ప‌డి లేచే మ‌న‌సు అనే టైటిల్‌ని పెట్టడం విశేషం. హ‌ను రాఘ‌వ‌పూడి అందాల రాక్ష‌సి అనే ప్రేమ‌క‌థను ఎంత క‌వితాత్మ‌కంగా తీసారో తెలిసిందే. 
 
ఈరోజు రిలీజ్ చేసిన టైటిల్ మరియు ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే.. ఇది కూడా మ‌రో క‌వితాత్మ‌క‌మైన ప్రేమ‌క‌థ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌కతా, ముంబయిలో జరుగుతోంది. నేపాల్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాల‌నుకున్నారు కానీ.. కుద‌ర‌లేదు. శ‌ర్వానంద్ - సాయిప‌ల్ల‌వి జంట స్ర్కీన్‌పై చేసే ప్రేమ సంద‌డితో యువ‌త‌రాన్ని ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటారో చూడాలి.