బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 6 మార్చి 2018 (13:03 IST)

నాగార్జున‌తో పోటీప‌డుతోన్న నంద‌మూరి హీరో..!

నాగార్జున‌తో పోటీప‌డుతోన్న నంద‌మూరి హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా? విష‌యం ఏమిటంటే... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆఫీస‌ర్. వివాద‌స్ప‌ద‌ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆఫీస‌ర్ ప్ర‌స్తుతం ముంబాయిలో ష

నాగార్జున‌తో పోటీప‌డుతోన్న నంద‌మూరి హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా?  విష‌యం ఏమిటంటే... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆఫీస‌ర్. వివాద‌స్ప‌ద‌ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆఫీస‌ర్ ప్ర‌స్తుతం ముంబాయిలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల ఆఫీస‌ర్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ లుక్‌తో పాటు మూవీని మే 25న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. 
 
ఇప్పుడు మే 25నే నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తోన్న నా నువ్వే చిత్రాన్ని కూడా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 180 మూవీ ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన నా నువ్వే టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. క‌ళ్యాణ్ రామ్ లుక్ కొత్త‌గా ఉండ‌టం.. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతుండ‌టంతో
ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. 
 
అయితే...నాగార్జున ఆఫీస‌ర్, క‌ళ్యాణ్ రామ్ నా నువ్వే... ఈ రెండు సినిమాలు ఒకేరోజు థియేట‌ర్స్ లోకి వ‌స్తుండ‌టంతో అటు అక్కినేని అభిమానుల్లో, ఇటు నంద‌మూరి అభిమానుల్లో ఈ రెండు సినిమాలపై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌రి...అక్కినేని సీనియ‌ర్ హీరో నాగార్జున‌, నంద‌మూరి యంగ్ హీరో క‌ళ్యాణ్ రామ్ మ‌ధ్య జ‌రిగే ఈ పోటీలో ఎవ‌రు గెలుస్తారో చూడాలి.