గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (10:34 IST)

Chandra Mohan ఇకలేరు.. హృద్రోగంతో కన్నుమూత

సీనియర్ నటులు, కథానాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ ఇకలేరు. ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో తుదిశ్వాస విడిచారు. మరణించేనాటికి ఆయన వయస్సు 82 ఏళ్లు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయి. 
 
కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు ముల్లంపల్లి చంద్రశేఖర రావు. 1966 రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. 
 
తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. పదహారేళ్ల వయస్సు, సిరిసిరి మువ్వ సినిమాల్లో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి.