శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (07:02 IST)

చెన్నై మహానగరంలో 'రెడ్ లైట్ ఏరియా' ఉండాల్సిందే?!

దేశంలో రెడ్‌లైట్ ఏరియాలు అధికారికంగా ఉన్న మహానగరాల్లో ముంబై, కోల్‌కతాలు ముందు వరుసలో ఉన్నాయి. అయితే, ఇలాంటి ఏరియా చెన్నై మహానగరంలో కూడా ఉండాలని ఓ యువ దర్శకుడు కోరుకుంటున్నారు. ఇదే కథాంశంతో ఆయన సినిమాన

దేశంలో రెడ్‌లైట్ ఏరియాలు అధికారికంగా ఉన్న మహానగరాల్లో ముంబై, కోల్‌కతాలు ముందు వరుసలో ఉన్నాయి. అయితే, ఇలాంటి ఏరియా చెన్నై మహానగరంలో కూడా ఉండాలని ఓ యువ దర్శకుడు కోరుకుంటున్నారు. ఇదే కథాంశంతో ఆయన సినిమాను తెరకెక్కించనున్నాడు. ఆ చిత్రం పేరు "శివప్పు ఎనక్కు పిడిక్కుం" (ఎరుపు నాకు ఇష్టం). 
 
ఈ చిత్రం పూర్తిగా రెడ్‌లైట్ ఏరియా ఉండాల్సిందేననే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. "ఒక వేశ్య తన దగ్గరకు వచ్చిన ఓ ఐదుగురు వ్యక్తుల మనస్తత్వాలను.. ఒక రచయితకు వివరించడమే ఈ సినిమా కథ". సమాజంలో రేప్ ఘటనలకి వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. యురేక దర్శకుడు. జే. సతీష్ కుమార్ నిర్మాత. ఇలాంటి వివాదాస్పద సబెక్టుని తీసుకోవడమే ఓ సాహాసం అని చెప్పొచ్చు.