మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:20 IST)

షబానా ఆజ్మీకి పంది జ్వరం

దేశంలోని పలు ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. ఈ జ్వరం బారినపడిన అనేకమంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా, బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ కూడా స్వైన్ ఫ్లూ బారినపడింది. గత కొన్ని రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేసి స్వైన్ ఫ్లూ అని నిర్ధారించారు. 
 
ముంబైలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం కాస్త మెరుగుప‌డింద‌ని, పూర్తిగా కోలుకున్న త‌ర్వాత వైద్యులు ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేస్తామ‌ని అన్న‌ట్టు ష‌బానా తెలిపారు. 2017లో 'ది బ్లాక్ ప్రిన్స్' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించింది ష‌బానా. ఆమె ఆరోగ్యం త్వ‌ర‌గా కుదుట‌ప‌డాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.