సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (13:52 IST)

షారుక్ ఖాన్‌‌కు వై ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు

Shahrukh Khan
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌‌కు వై ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. షారుక్‌కు బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు భద్రతను పటిష్టం చేసింది మహారాష్ట్ర సర్కారు. 
 
వై ప్లస్ సెక్యూరిటీ కింద షారూఖ్ ఖాన్‌కు 11 మందితో భద్రతను ఏర్పాటు చేశారు. వీరిలో ఆరుగురు కమెండోలు కాగా, మిగిలిన నలుగురు రాష్ట్ర వీఐపీ సెక్యూరిటీ వింగ్‌కు చెందినవారు.  
 
'పఠాన్' సినిమా సమయంలో షారుక్‌కు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సెక్యూరిటీగా ఏర్పాటు చేసింది. దీనికి తోడు షారుక్‌కు తన సొంత బాడీగార్డ్స్ కూడా ఉన్నారు.