శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (10:02 IST)

మహేష్ బాబు ఫ్యామిలీతో మంచి సంబంధం ఉంది.. అప్పుడప్పుడు కలుస్తుంటాం: షారూఖ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ స్పాట్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ మెరిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యామిలీ సీక్రెట్ గురించి షారూఖ్ ఖాన్ నోరు విప్పాడు. మ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ స్పాట్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ మెరిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యామిలీ సీక్రెట్ గురించి షారూఖ్ ఖాన్ నోరు విప్పాడు. మహేష్ బాబు ఫ్యామిలీతో షారుక్ తరుచూ కలుస్తుంటాడట. ప్రస్తుతం 'రాయీస్'తో బిజీగా ఉన్నాడు షారుక్. రాహుల్ ధోలకియా దర్శకత్వంలో షారుక్ - మహిరా ఖాన్ జంటగా తెరకెక్కిన 'రాయీస్' వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ నేపథ్యంలో షారూఖ్ రయీస్ ప్రమోషన్‌లో బిజీగా ఉంటున్నాడు. ఈ  సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో మహేష్ బాబు ఫ్యామిలీ మంచి అనుబంధం ఉంది. తరచూ మహేష్ ఫ్యామిలీతో కలుస్తుంటామన్నారు.
 
అంతేకాదు.. 'బాహుబలి' సినిమా చూశా. అద్భుతమైన సినిమాకు బ్లూ ప్రింట్ లాంటిందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు. షారుక్ అమ్మమ్మగారి ఊరు కూడా హైదరాబాదే కావడంతో చిన్నప్పటి నుంచి హైదరాబాదుకు వస్తూపోతుంటానని షారూఖ్ వ్యాఖ్యానించాడు.