సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (13:36 IST)

గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న రొమాంటిక్ హీరో

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం "పడి పడి లేచే మనసు" చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం తర్వాత శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
 
ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్‌ శివార్లలో భారీ సెట్‌ కూడా వేశారు. ఈ చిత్రం షూటింగ్ 50 శాతం మేరకు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను శర్వానంద్ బహిర్గతం చేశారు. 
 
తన తదుపరి చిత్రం సుధీర్ వర్మ సినిమాలో నటిస్తానని ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించనున్నట్టు చెప్పాడు. 1980 బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. ప్రజెంట్, పాస్ట్ షేడ్స్‌లో శర్వానంద్‌ను ఇందులో చూపించబోతున్నారు. దీనికి సంబంధించిన త్వరలోనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.
 
ప్రస్తుతం 'పడిపడి లేచే మనసు' సినిమా ప్రచారంలో ఉన్న శర్వానంద్, ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే సింగిల్ షెడ్యూల్‌లో శర్వానంద్ సినిమాను పూర్తిచేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనుంది.