ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (17:48 IST)

''కాటమరాయుడు" సినీ డీటైల్స్: పవన్‌ సినిమాలో ఆ ముగ్గురు హీరోలా? వికీలో..?

గబ్బర్ సింగ్ 2 అట్టర్ ఫ్లాప్ కావడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బంపర్ హిట్ కొట్టాలనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాలో తన లక్కీ గర్ల్ శ్రుతిహాసన్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు. గబ్బర్ సింగ్ హిట్ కావడంతో

గబ్బర్ సింగ్ 2 అట్టర్ ఫ్లాప్ కావడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బంపర్ హిట్ కొట్టాలనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాలో తన లక్కీ గర్ల్ శ్రుతిహాసన్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు. గబ్బర్ సింగ్ హిట్ కావడంతోనే శ్రుతిని కాటమరాయుడు హీరోయిన్‌గా పవన్ సిఫార్సు చేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కాటమరాయుడు చిత్రంలో ముగ్గురు హీరోలు కూడా నటించబోతున్నారట. 
 
పవన్ కళ్యాణ్-డాలీ కాంబోలో వస్తున్న ''కాటమరాయుడు" చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ కీలక పాత్ర కోసం ఎంపికయ్యాడని తెలిసింది. అలాగే విజయ్ దేవరకొండతో పాటు శర్వానంద్, నవీన్ చంద్రలను కూడా సినీ యూనిట్ ఎంపిక చేసింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ కాటమరాయుడు వికిపీడియా పేజీలో ఉంది. కానీ ఈ వ్యవహారంపై క్లారిటీ లేదు. అయితే కాటమరాయుడు పేజ్ లోనే కాదు. 
 
శర్వానంద్ వికీలో కూడా ‘కాటమరాయుడు’ సినిమా లింక్ వుంది. సో.. ఈ లెక్కన చూస్తే శర్వానంద్, నవీన్ చంద్రలతో పాటు విజయ్ దేవరకొండ కూడా కాటమరాయుడు సినిమాలో భాగం కానున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా ఈ నెల 22 నుంచి సెట్స్‌పైకి రానుంది.