బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2017 (09:43 IST)

షో టైమ్ ఆడియో విడుదలకు రాజమౌళి.. తప్పులు ఉండకుండా చూసుకోండి..

కాంచీ దర్శకత్వంలో రామ రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మించిన 'షో టైమ్‌' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కన రాజమౌళి పాల్గొన్నారు. రణధీర్‌, రుక్సార్‌ జంటగా నట

కాంచీ దర్శకత్వంలో రామ రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మించిన 'షో టైమ్‌' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కన రాజమౌళి పాల్గొన్నారు. రణధీర్‌, రుక్సార్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎమ్‌.ఎమ్‌.కీరవాణి సంగీతం సమకూర్చారు. 'మర్యాద రామన్న', 'ఈగ' చిత్రాల రచయిత ఎస్‌.ఎస్‌.కాంచీ ప్రతి ఒక్కరిలోనూ తప్పులు చూపిస్తుంటారని రాజమౌళి తెలిపారు. 
 
తాము తొమ్మిది మంది కజిన్స్ అని.. కాంచీ అన్న ఒకడు. కాంచన్న చాలా వెటకారంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక వెటకారం ఉంటుంది. వాస్తవానికి ఆయన ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి కానీ చాలా ఆలస్యం అయ్యిందని రాజమౌళి చెప్పారు. 
 
ప్రతి ఒక్కరిలో తప్పులు చూపించే ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తప్పులు ఉండకూడదని కోరుకుంటున్నానని తెలిపారు. కీరవాణి గారి సంగీతం అలరిస్తుంది. ఈ సినిమాలో మా కార్తికేయ పాట పాడాడు. వాడు బాగా పాడతాడని తెలుసుగానీ, ఇంత బాగా పాడతాడని తెలియదని తెలిపారు.