మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (15:26 IST)

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

girl student fight
ఒకే అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ఇష్టపడ్డారు. అతను నా వాడంటే.. కాదు నా వాడంటూ వాగ్వాదానికి దిగారు. చివరకు నడిరోడ్డుపై వారిద్దరూ సిగపట్లుపట్టారు. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
పూర్నియా జిల్లాలోని గులాబ్ బాగ్ హన్స్‌దా రోడ్డు సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇక్కడ స్కూన్ యూనిఫామ్‌లో ఉండే ఇద్దరు అమ్మాయిలు నడి రోడ్డుపై జట్టుపట్టుకుని కొట్టుకుంటూ కనిపిస్తారు. వారివద్ద ఆరా తీయగా, తామిద్దరం ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్నామని తెలిపారు. 
 
ఇపుడు ఆ అబ్బాయి కోసం వారిద్దరూ ఇతర విద్యార్థుల ముందు వాగ్వాదానికి దిగారు. అలా వాగ్వాదంతో బయటకు వచ్చే క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయిం చేసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత వారికి వాళ్ల స్నేహితులు తోడయ్యారు. 
 
దాంతో గొడవ కాస్త మరింతగా పెద్దదైంది. ఈ క్రమంలో వారంతా రెండు వర్గాలుగా చీలిపోయి, రోడ్డుపై చితక్కొట్టుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ఇతరులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. బుద్ధిగా చదువుకోవాల్సిన ఈ సమయంలో ఒక అబ్బాయి కోసం ఈ దిక్కుమాలిన పనులు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.