1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2016 (11:27 IST)

''గౌతమి పుత్ర శాతకర్ణి" శ్రియ లుక్‌.. శాతకర్ణి భార్య వశిష్టి దేవిగా అదుర్స్!

బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న ''గౌతమి పుత్ర శాతకర్ణి" షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియ నటిస్తున్న సంగతి తెల్సిందే. కాగా ఆదివారం శ్రి

బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న ''గౌతమి పుత్ర శాతకర్ణి" షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియ నటిస్తున్న సంగతి తెల్సిందే. కాగా ఆదివారం శ్రియ పుట్టినరోజును పురస్కరించుకుని ''గౌతమి పుత్ర శాతకర్ణి"లో శ్రియ లుక్‌ను రిలీజ్ చేశారు. శాతకర్ణి భార్య వశిష్టి దేవిగా శ్రియ కనిపించనుంది. 
 
ఈ లుక్‌లో శ్రియ వశిష్టి దేవి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. ఈ లుక్‌లో శ్రియను చూసిన ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ఈ సినిమా 2017 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతోంది. రాజీవ్ రెడ్డితో కలిసి క్రిష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య కెరియర్లో ఇది మరపురాని చిత్రంగా మిగిలిపోతుందని చిత్ర యూనిట్ అంటోంది.