తమిళ బిగ్ బాస్ హోస్ట్‌గా శ్రుతిహాసన్
తమిళ బిగ్ బాస్ ఐదో సీజన్ హోస్ట్ కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కమల్ హాసన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ బిగ్ బాస్ హోస్ట్‌పై సందిగ్ధత నెలకొంది. తెలుగులో నాగార్జున సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటే సమంత హోస్ట్‌గా వ్యవహరించి విషయం తెలిసిందే. తాజాగా తమిళ బిగ్‌బాస్‌లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఇటీవల అమెరికా టూర్ వెళ్లొచ్చిన కమల్ హాసన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో రెండు వారాల పాటు కమల్ బిగ్‌బాస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే కమల్ స్థానంలో నటీమణి, కమల్ కూతురు శృతీ హాసన్‌ను తీసుకొచ్చేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శృతీ హాసన్ అయితే బాగుంటుందని భావిస్తోన్న షో నిర్వాహకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్. మరి కమల్ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారో చూడాలి.