ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 23 ఫిబ్రవరి 2017 (15:27 IST)

సిమ్రాన్‌ మళ్లీ మొదలుపెట్టింది... ఏంటది?

కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయకుల సరసన నటించిన సిమ్రన్‌ వివాహం తరువాత సినిమాలకి దూరంగా వుంది. ఆ తర్వాత మళ్లీ నటన పట్ల ఆసక్తిని చూపింది. కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో టీవీ షోలలో పాల్గొంది. కాగా, ఆమె అరవింద్‌ స్వామితో కలిసి నటించడాన

కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయకుల సరసన నటించిన సిమ్రన్‌ వివాహం తరువాత సినిమాలకి దూరంగా వుంది. ఆ తర్వాత మళ్లీ నటన పట్ల ఆసక్తిని చూపింది. కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో టీవీ షోలలో పాల్గొంది. కాగా, ఆమె అరవింద్‌ స్వామితో కలిసి నటించడానికి అంగీకరించింది.
 
అరవింద్‌ స్వామి.. రితికా సింగ్‌.. నందిత ప్రధాన పాత్రధారులుగా సెల్వ ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం సిమ్రాన్‌ను తీసుకున్నారు. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పాత్ర నచ్చడం వల్లనే సిమ్రాన్‌ ఓకే చెప్పిందని చిత్ర యూనిట్‌ తెలియజేస్తుంది.