Simran Singh: ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య.. ఉరేసుకుంది.. ఆ లెటర్ కనిపించలేదు.. (video)
Simran Singh: జమ్మూకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రముఖ రేడియో జాకీ సిమ్రాన్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని సెక్టార్ 47లో సిమ్రాన్ ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహాత్య చేసుకుంది. సుసైడ్ చేసుకున్న విషయాన్ని స్నేహితురాలు గుర్తించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆమె ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సిమ్రాన్ సింగ్ సోషల్ మీడియాలో పెట్టిన పలు వీడియోలు వైరల్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఏడు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు హల్ చల్ చేశాయి. సిమ్రాన్ సింగ్ స్వస్థలం జమ్ము కాశ్మీర్ అని పోలీసులు వెల్లడించారు.