శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 మార్చి 2017 (11:13 IST)

నా అందాలు.. నా ఇష్టం.. చూపిస్తే తప్పేంటి: సోనమ్ కపూర్

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్. తాను ఎవరేమనుకున్నా చెప్పాలనుకునేది ముక్కుసూటిగా చెప్పేస్తుంది. ఇంతకీ ఈమె ప్రస్తావన ఎందుకంటే రీసెంట్‌గా ముంబైలో ఓ ఈవెంట్‌కి హాజరైన ఈ ముద్దుగుమ్ము, బ్లాక్ జంప్‌సూట్ డ్రెస్

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్. తాను ఎవరేమనుకున్నా చెప్పాలనుకునేది ముక్కుసూటిగా చెప్పేస్తుంది. ఇంతకీ ఈమె ప్రస్తావన ఎందుకంటే రీసెంట్‌గా ముంబైలో ఓ ఈవెంట్‌కి హాజరైన ఈ ముద్దుగుమ్ము, బ్లాక్ జంప్‌సూట్ డ్రెస్ ధరించింది. అదే అసలు వివాదానికి కేంద్ర బిందువైంది. మంచి డ్రెస్ వేసుకున్నానని, నా బాడీ పట్ల నేను గర్వంగా ఫీలవుతానని వెల్లడించింది.
 
డీప్ క్లీవేజ్ ఒకటైతే, దానికిమించి చూపించిన ఎక్స్‌ట్రా స్కిన్ షో. దీంతో ఆమె ధరించిన డ్రెస్‌పై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. తాను మంచి డ్రెస్ వేసుకున్నానని, ఈ విషయంలో ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునేది లేదని చెప్పేసింది. నా అందాలు.. నా యిష్టం.. నేను ఎలాంటి దుస్తులు వేసుకుంటే మీకేంటి అంటూ డ్రెస్ గురించి స్థానిక మీడియా రాతలపై కాసింత రుసరుసలాడింది.
 
ఎన్నో సమస్యలపై చర్చిస్తానని, వాటిని పక్కనపెట్టి నేను వేసుకున్న డ్రెస్‌పై చర్చ అవసరమా? అని ప్రశ్నించింది. కొద్దిరోజుల కిందట తాను 13 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానంటూ అప్పట్లో ఈమె చెప్పిన విషయం తెల్సిందే.