ఒక్క కాల్ చేస్తే నీ పాటలు పాడేవాణ్ణి కాదుగా.. అయినా నువ్వు నా మిత్రుడివే: బాలు నిష్టూరం
నీ సంగీత కచ్చేరీలలో నా పాటలు పాడొద్దు అంటూ ఇళయరాజా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పంపిన లీగల్ నోటీసుతో నాలుగు దశాబ్దాలకు పైగా సాగిని వారి స్నేహ బంధం తెగిపోయినట్లే అని అందరూ భావించారు కానీ సంగీత బ్రహ్మ ఇళయరాజా తాను ఇప్పటికీ మంచి స్నేహితులమే అ
నీ సంగీత కచ్చేరీలలో నా పాటలు పాడొద్దు అంటూ ఇళయరాజా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పంపిన లీగల్ నోటీసుతో నాలుగు దశాబ్దాలకు పైగా సాగిని వారి స్నేహ బంధం తెగిపోయినట్లే అని అందరూ భావించారు కానీ సంగీత బ్రహ్మ ఇళయరాజా తాను ఇప్పటికీ మంచి స్నేహితులమే అని స్పష్టం చేశారు ఎస్పీ బాలు.. కానీ ఎక్కడినుంచో లీగల్ నోటీసు పంపడం కాకుండా ఒక్క ఫోన్ కాల్ నాకు నేరుగా పోన్ చేసి ఉంటే ఈ సమస్య పరిష్కారమైపోయేది గోటితో పోయేదానిపై గొడ్డలిని ప్రయోగించావు అంటూ బాధను వ్యక్తం చేశారు బాలు.
ఇళయరాజా కానీ ఆయన ఆఫీస్ నుంచి ఎవరైనా సరే పాటలు పాడవద్దని నాకు సమాచారం ఇస్తే బాగుండేది. ఒక్క ఫోన్‌కాల్ ద్వారా సమస్య అక్కడే పరిష్కారమైపోయేది. నాకూ ఆత్మాభిమానం ఉంది. నా పాటలు పాడొద్దు అని చెప్పిన తర్వాత పాడే కుసంస్కారిని కాదు అంటూ బాలు తమ మధ్య గొడవను తేలికగా తీసిపడేశారు. పైగా, సినిమా రంగంలోకి ప్రవేశించకముందు నుంచే మేమిద్దరం స్నేహితులమని. ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలను పాడేందుకే నేను పుట్టానని అందరూ అంటుంటారని బాలు తన మిత్రుడి గురించి ప్రశంసించారు. ఇళయరాజా వంటి గొప్ప సంగీత దర్శకుడితో పనిచేశానని, తమ ఇద్దరి మధ్య విరుద్ధ భావాలు లేవు. కాలమే మా సమస్యకు పరిష్కారం చూపుతుందని విచారం వ్యక్తం చేశారు బాలు.
బాలసుబ్రహ్మణ్యం వరల్డ్ టూర్ సందర్భంగా తాను సంగీత దర్శకత్వం వహించిన పాటలను పాడకూడదంటూ ఎస్పీబీకి ఇళయరాజా కోర్టు ద్వారా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.