గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 24 జూన్ 2017 (03:43 IST)

శ్రీదేవి అంటే ఇప్పటికీ రాఘవేంద్రరావుకు పిచ్చే.. ఛాన్సిస్తే వదలనంటున్నాడు

శ్రీదేవి స్ట్రైట్ సినిమా తెలుగులో చూసి దశబ్దాలు గడిచాయి కదా. ఇప్పుడు మళ్లీ అ అవకాశం మామ్ రూపంలో మనముందుకు వస్తోంది. శ్రీదేవి టైటిల్ రోల్ పోషించిన మామ్ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌‌లో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంది

శ్రీదేవి స్ట్రైట్ సినిమా తెలుగులో చూసి దశబ్దాలు గడిచాయి కదా.  ఇప్పుడు మళ్లీ అ అవకాశం మామ్ రూపంలో మనముందుకు వస్తోంది. శ్రీదేవి టైటిల్ రోల్ పోషించిన మామ్ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌‌లో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబందించిన ప్రముఖులు ఒకనాటి అందాలతారతో తమ జ్ఞాపకాలు పంచుకున్నారు. శ్రీదేవితో 24 సినిమాలు తీసి హిట్ మీద హిట్ ఇచ్చిన దర్శకేంద్రుడు కె.  రాఘవేంద్రరావు, సురేష్ బాబు, కళాబంధు సుబ్బరామిరెడ్డి తదితరులు ట్రైలర్ విడుదల సందర్బంగా ప్రసంగించారు.
 
‘‘ఇండియాలోని అన్ని జనరేషన్స్‌కి తెలిసిన ఒకే ఒక్క పేరు శ్రీదేవి. బాల నటిగా మొదలైన తన కెరీర్‌ ‘మామ్‌’ చిత్రం వరకూ సాగడమంటే మామూలు విషయం కాదు. శ్రీదేవితో 24 సినిమాలు చేసిన ఏకైక దర్శకుణ్ణి నేనే. కోన వెంకట్‌ కథ అందించి, సురేశ్‌బాబు ఫైనాన్స్‌ చేసి శ్రీదేవి డేట్స్‌ ఇస్తే తనతో సిల్వర్‌ జూబ్లీ మూవీ చేస్తాను’’ అన్నారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. శ్రీదేవి టైటిల్‌ రోల్‌లో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మామ్‌’ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 
రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘ఏదైనా సినిమా బాగుందని తెలిస్తే వెళతాం. కానీ, శ్రీదేవి సినిమాలో ఉందని తెలిస్తే ఆలోచించకుండా వెళ్తాం. ఎందుకంటే తను గ్లామర్‌గా ఉంటుంది.  యాక్టింగ్, డ్యాన్స్‌ బాగా చేస్తుంది కాబట్టి’’ అన్నారు. నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘శ్రీదేవిగారితో మా నాన్నగారు దేవత, ముందడుగు, తోఫా వంటి చిత్రాలు తీసారు. అప్పడు నేను పక్కన నిలబడి చూస్తుండేవాణ్ని. ఆమె సూపర్‌స్టార్‌. ప్రేక్షకులకు డ్రీమ్‌ గర్ల్‌. ‘మామ్‌’ రషెష్‌ చూశా. ఎక్సలెంట్‌గా నటించారు’’ అన్నారు. ‘‘బోనీ కపూర్‌ సినిమాల మేకింగ్‌లో లాభనష్టాలు చూసుకోడు.శ్రీదేవి అప్పట్లో ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉన్నారు’’ అన్నారు ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి.
 
‘‘దేవుడు అన్ని చోట్ల ఉండకుండా అమ్మను సృష్టిస్తాడనేది ఎంత నిజమో, ‘మామ్‌’ సినిమా చేయడానికి శ్రీదేవిగారిని క్రియేట్‌ చేశారనేది అంతే నిజం. జూలై 7న సినిమా విడుదల కానుంది’’ అని రచయిత కోన వెంకట్‌ అన్నారు. ‘‘నా జీవితానికి భార్య ఎంత ప్రాణమో ఈ సినిమాకు అంతే ప్రాణం. ఇప్పటి వరకు తను చేసిన పాత్రలన్నింటిని మించే పాత్ర ‘మామ్‌’’ అని నిర్మాత, శ్రీదేవి భర్త బోనీకపూర్‌ అన్నారు. 
 
శ్రీదేవి మాట్లాడుతూ – ‘‘మామ్‌’ ఎంత పెద్ద హిట్‌ అవుతుందనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ఓ నటిగా నాకు సంతృప్తినిచ్చింది. మా ఆయన ఇంత మంచి గిఫ్ట్‌ ఇవ్వడం నా అదృష్టం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎ.ఆర్‌.రెహమాన్, నిర్మాతలు బోనీ కపూర్, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌.