శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 13 అక్టోబరు 2018 (19:41 IST)

సుమంత్ కూడా అప్పుడే వ‌స్తున్నాడా..?

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన  చిత్రం ఇదం జగత్. అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సారును పూర్తిచే య‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రామిసింగ్ చిత్రాల కథానాయకుడు సుమంత్ ఈ చిత్రంలో కెరీర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
 
తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చెయ్యబోతున్నాడు. విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. ఈ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది.
 
ఇదిలాఉంటే.. అక్కినేని నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి న‌వంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పుడు సుమంత్ కూడా నవంబరు ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలియ‌చేసాడు. మ‌రి.. న‌వంబ‌ర్‌లో చైతు, సుమంత్ వీరిద్ద‌రి చిత్రాల్లో ఎవ‌రి సినిమా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.