కృతిసనన్‌తో సహజీవనం చేస్తున్న హీరో సుశాంత్! చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్!
బాలీవుడ్ నటి కృతిసనన్‌తో హీరో సుశాంత్ సహజీవనం చేస్తున్నట్టు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి షికార్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయినప్పటికీ.. ఈ ప్రేమ
బాలీవుడ్ నటి కృతిసనన్‌తో హీరో సుశాంత్ సహజీవనం చేస్తున్నట్టు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి షికార్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయినప్పటికీ.. ఈ ప్రేమపక్షులు మాత్రం పెదవి విప్పడం లేదు.
నటి కృతిసనన్, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌లు ఆఫ్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెల్సిందే. గత కొంతకాలంగా వీరిద్దరు చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. కృతిసనన్‌తో ప్రేమ కారణంగానే సుశాంత్ తన భార్య అంకితాకు విడాకులు ఇచ్చాడనే ప్రచారం కూడా ఉంది. పైగా, కృతిసనన్ - సుశాంత్‌లు సహజీవనం చేస్తున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ.. తమ ప్రేమ వ్యవహారంపై సుశాంత్, కృతిసనన్‌లు మాత్రం పెదవి విప్పలేదు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అంటూ చెబుతూవచ్చారు. ప్రస్తుతం ఈ ప్రేమ జంట కలయికలో "రబ్తా" చిత్రం తెరకెక్కుతున్నది. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిమధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. సినిమాలో వీరి కెమిస్ట్రీపై చిత్ర వర్గాలు చాలా నమ్మకం పెట్టుకున్నాయి.
ఇదిలావుండగా కొత్త ఏడాది సంబరాల్ని లండన్‌లో కలిసి జరుపుకున్న ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచారు. వీరి సీక్రెట్ ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో సుశాంత్, కృతిసనన్‌ల ప్రేమాయణం నిజమేనంటూ బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.