శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:54 IST)

విశాల్ సస్పెన్షన్‌ను ఉపసంహరించాలి.. ఆ వ్యాఖ్యల్లో తప్పేముంది... వాక్ స్వాతంత్ర్యం అందరికీ ఉంది..

సినీ నటుడు, నిర్మాత విశాల్‌కు ఊరట లభించింది. విశాల్‌పై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని నిర్మాతల మండలికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మండలి నుంచి తనను అన్యాయంగా తొలగించారని విశాల్‌ దాఖలు చేసిన పిటిషన్

సినీ నటుడు, నిర్మాత విశాల్‌కు ఊరట లభించింది. విశాల్‌పై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని నిర్మాతల మండలికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మండలి నుంచి తనను అన్యాయంగా తొలగించారని విశాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కోర్టు విచారించింది. అనంతరం నిర్మాతల మండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న విశాల్‌... నిర్మాతల మండలిలోనూ సభ్యుడిగా ఉన్నారు. త్వరలో జరగనున్న మండలి ఎన్నికల్లో కూడా విశాల్‌ బృందం పోటీ చేయనుంది. ఈ స్థితిలో విశాల్‌ మండలి తీరును విమర్శించారు. దీనిపై మండలి అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సస్పెన్షన్ వేటు వేసింది. దీన్ని సవాలు చేస్తూ విశాల్‌ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ వేశారు.
 
అయితే విశాల్‌ వ్యాఖ్యల్లో తప్పేముందని కోర్టు ప్రశ్నించింది. వాక్‌ స్వాతంత్య్రం అందరికీ ఉందని, ఏదైనా అభ్యంతరం ఉంటే సంబంధికలపై కోర్టుగానీ, అసెంబ్లీగానీ చర్యలు చేపడతాయని పేర్కొంది. ఆయనపై సస్పెషన్‌ను ఎత్తివేయాలని నిర్మాతల మండలికి ఉత్తర్వులు జారీ చేసింది.