1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2016 (16:30 IST)

నా డ్రీమ్ రోల్ వస్తే.. ఫ్రీగా సినిమా చేసి పెడతా : హీరో కార్తీ

హీరో కార్తీ తన మనసులోని మాటను వెల్లడించారు. తన డ్రీమ్ రోల్ అయిన రైతు పాత్ర వస్తే మాత్రం ఉచితంగా ఆ సినిమా చేసి పెడతానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్

హీరో కార్తీ తన మనసులోని మాటను వెల్లడించారు. తన డ్రీమ్ రోల్ అయిన రైతు పాత్ర వస్తే మాత్రం ఉచితంగా ఆ సినిమా చేసి పెడతానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న హీరోయిన్లకు కూడా కార్తీ కౌంటర్ ఇచ్చాడు. 
 
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కార్తీ మాట్లాడుతూ... 'సినిమాలో హీరోలు ఎంత ముఖ్యమో... హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం. అందుకే హీరోలకు ఇచ్చే స్థాయిలో మాకు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాలి' అంటూ గొంతు విప్పే భామలు కామెంట్స్ గురించి తాను కూడా విన్నానని, అయితే హీరోయిన్లకు వారి రేంజ్‌ను బట్టి ప్రస్తుతం ఇస్తున్న పారితోషకాలు సరైనవే అని అభిప్రాయపడ్డాడట కార్తీ. అయినా రెమ్యూనరేషన్ అనేది జెండర్‌ను బట్టి ఉండదని, అది స్టార్ ఇమేజ్‌ను బట్టి ఉంటుందన్నారు. 
 
ఇకపోతే.. తాను ఎప్పటి నుంచో పోషించాలనుకుంటున్న డ్రీమ్ రోల్ గురించి ఓపెన్ అయ్యాడట కార్తీ. ఎప్పటినుంచో వెండితెరపై రైతులా కనిపించాలనే కోరిక ఉందని, ఆ ఛాన్స్ తక్కువ రెమ్యునరేషన్‌కే ఈ రోల్ చేసిపెడతానని ఆఫర్ కూడా ఇస్తున్నాడట. అయితే... సినిమాలో స్ట్రాంగ్ మెసేజ్ ఉండాలన్నది అబ్బాయిగారి కండీషనట. మరి ఈ టాలెంటెడ్ హీరో ముచ్చట తీర్చేందుకు ఏ దర్శకుడైనా రైతు కథతో ముందుకొస్తాడేమో చూడాలి.