నటుడు రాజశేఖర్ కన్నుమూత

rajasekhar
ఎం| Last Updated: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:04 IST)
ప్రముఖ దర్శకుడు, తమిళ సీనియర్ నటుడు రాజశేఖర్ అనారోగ్యం కారణంగా మృతిచెందారు. ఆయన వయసు 62 ఏళ్లు. చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇటీవల అస్వస్థత కారణంగా స్థానిక రామచంద్ర ఆసుపత్రిలో చేరారు.

అక్కడే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజశేఖర్ ఆ తరువాత నటుడిగా మారారు.


భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన 'నిళల్ గల్' చిత్రంలోఒక హీరోగా రాజశేఖర్ నటించారు. 'ఇదు ఒరు పొన్ మాలై పొళుదు..' అనే పాట ద్వారా అందరికీ సుపరిచితుడయ్యాడు. 'పలైవనచోలై', 'చిన్నపూవే మెల్ల పెసు' తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.దీనిపై మరింత చదవండి :