శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (13:11 IST)

బిగ్ బాస్ తర్వాత రంగులో తనీష్.. వివాదం తప్పదా?

బిగ్ బాస్-2లో పాల్గొన్న తనీష్ పేరు బాగా పాపులర్ అయ్యింది. హీరోగా అతనికి గుర్తింపు రాకపోయినా..  బిగ్‌బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. హౌస్‌లో వున్నంతకాలం కౌశల్‌తో గొడవపడిన తనీష్.. తరచూ వార్తల్లో నిలిచాడు. తాజాగా తనీష్ హీరోగా ''రంగు'' అనే సినిమా తెరకెక్కనుంది. బిగ్ బాస్-2కి తర్వాత రంగు అనే సినిమాలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం వివాదాస్పదమైంది. 
 
ఈ సినిమాలో తనీష్ విజయవాడకు చెందిన లారా అనే రౌడీ పాత్రలో కనిపించనున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో లారాను రౌడీషీటర్‌గా చూపించడంపై ఆయన కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. దీనిపై ఇప్పటికే దర్శకుడు వివరణ ఇచ్చారు. కానీ తాజాగా తనీష్ ఈ వ్యవహారంపై స్పందించారు. 
 
మనిషి ఈ సమాజంలో ఎలా వుండకూడదో చెప్పే విధంగా ఈ సినిమా వుంటుందని.. లారా పాత్ర అతడి ఐడియాలజీ అన్నీ ఈ సినిమాలో వుంటాయన్నారు. సినిమా చూస్తే వాళ్ల కుటుంబ సభ్యులకు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని చెప్పారు. శని, ఆదివారాల్లో లారా కుటుంబానికి ఈ సినిమా షో వేసి చూపిస్తామన్నారు.