శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 14 నవంబరు 2018 (18:20 IST)

బాబూ.. శ్రీను వైట్ల ఇది నిజ‌మా..?(Video)

కామెడీకి స్టార్ స్టేట‌స్ తెచ్చిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల‌. త‌నదైన శైలిలో కామెడీని పండించి.. స‌క్స‌ెస్ సాధించిన శ్రీను వైట్ల ఇటీవ‌ల కాలంలో ఆగ‌డు,  బ్రూస్ లీ, మిస్ట‌ర్ చిత్రాల‌తో వ‌రుస‌గా ఫ్లాప్స్ సొంతం చేసుకుని కెరీర్లో బాగా వెన‌క‌బ‌డ్డాడు. తాజాగా మాస్ మ‌హా రాజా ర‌వితేజ‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమాని తెర‌కెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా మీద శ్రీను వైట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. 
 
ఎంత కాన్పిడెంట్‌గా ఉన్నాడు అంటే... అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనిని హిందీలోనూ రీమేక్ చేయాల‌నుకుంటున్నాడట‌. ఇదివ‌ర‌కు ఢీ, దూకుడు సినిమాల్ని బాలీవుడ్‌లో తీయ‌మ‌ని ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ కుద‌ర్లేదు. ఈసారి మాత్రం అలాంటి అవ‌కాశం వ‌దులుకోను. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ హిందీ రైట్స్ నా ద‌గ్గ‌రే ఉంచుకున్నాను. తెలుగులో ఆడితే మాత్రం బాలీవుడ్‌లోనూ ఈ సినిమా చేస్తా అని క్లారిటీగా చెప్పేశాడు శ్రీ‌ను వైట్ల‌. మ‌రి.. వైట్ల న‌మ్మ‌కం ఎంతవ‌ర‌కు నిజం అవుతుందో చూడాలి. చూడండి శ్రీను వైట్ల ఇంటర్వ్యూ...