గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (09:11 IST)

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌లో తారా సుతారియా అవుట్.. కైరా అద్వానీకి ఛాన్స్

టాలీవుడ్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అర్జున్ రెడ్డి సినిమా ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి ద్వారా మాస్ హీరో విజయ్ దేవరకొండకి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చి

టాలీవుడ్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అర్జున్ రెడ్డి సినిమా ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి ద్వారా మాస్ హీరో విజయ్ దేవరకొండకి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. విజయ్‌తో పాటు ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన షాలిని పాండేకి కూడా మంచి గుర్తింపు లభించింది.
 
ఈ నేపథ్యంలో తమిళంలో రీమేక్ అవుతున్న అర్జున్ రెడ్డిలో చియాన్ విక్రమ్ కొడుకు దృవ్ నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే హిందీలో హీరో షాహిద్ కపూర్ 'అర్జున్ రెడ్డి' రీమేక్‌లో నటిస్తున్నాడు. తెలుగు వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగ హిందీ రీమేక్‌ని డైరెక్ట్ చేయబోతున్నారు.
 
ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట తారా సుతారియాని తీసుకున్నారు. కానీ ఆమె మరో సినిమాలో బిజీగా వుండటంతో.. ఈ సినిమా వదులుకుందని టాక్. ఇక హిందీ అర్జున్ రెడ్డి హీరోయిన్‌గా మహేష్ కథానాయికను ఖరారు చేశారు. 
 
ఎట్టకేలకు కైరా అద్వానీని ఫైనల్ చేశారని తెలుస్తోంది. మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాలో హీరోయిన్‌గా నటించిన కైరాఇటీవల లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.