1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Teaser released for a rollercoaster ride starting from a star in the sky

Dulquer Salmaanఫ ఆకాశంలో ఒక తార నుంచి రోలర్‌కోస్టర్ రైడ్‌ టీజర్ రిలీజ్

Dulquer Salmaan, Saathvika Veeravalli
Dulquer Salmaan, Saathvika Veeravalli
దుల్కర్ సల్మాన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్  ‘ఆకాశంలో ఒక తార’తో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.  విభిన్నమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పవన్ సాధినేనితో దుల్కర్ సల్మాన్ తొలిసారి కలిసి పనిచేస్తున్న సినిమా ఇది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
 
కల్పన జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని. అయితే చదువులో ఎంత ప్రతిభ చూపించినా, ఆమెను ప్రోత్సహించేవారు ఎవరూ ఉండరు. చివరికి తల్లిదండ్రులు కూడా ఆమెను నిరుత్సాహపరుస్తూ పెళ్లి చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆమె జీవితంలోకి వచ్చిన కృష్ణ, కల్పనకు అండగా నిలుస్తాడు. ఆమెకు అతిపెద్ద బలంగా మారి, ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తాడు.
 
కల్పన తన గ్రామం బౌండరీలు కూడా దాటలేదని చుట్టూ ఉన్నవారు చెబుతుంటారు. కానీ ఆమె మాత్రం భూమి హద్దులను దాటి ఆకాశాన్ని చేరుకుంటానని ధైర్యంగా చెబుతుంది. అదృష్టవశాత్తూ కృష్ణ కూడా ఆమె కలను అర్థం చేసుకుంటాడు. పెద్దగా కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడాలని, లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని ఆమెను ప్రోత్సహిస్తాడు.
 
దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ ఇంతటి స్ఫూర్తిదాయకమైన, మహిళా సాధికారతను చాటిచెప్పే కథలో భాగం కావడమే ఈ సినిమాకు తొలి విజయం. ఈ కథలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యతనిస్తూ, ఆమె కలలకు అండగా నిలిచే విధానం దుల్కర్ కథల ఎంపికను మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. స్టార్‌డమ్‌కు మించి అర్థవంతమైన సినిమాలకు మద్దతు ఇవ్వాలనే ఆయన అభిరుచి ఈ చిత్రంతో మరోసారి స్పష్టమవుతోంది.
 
సాత్విక వీరవల్లికి మంచి డెబ్యు రోల్ లభించింది.  టీజర్‌లో ఆమె ప్రజెన్స్ ఎంతగానో ఆకట్టుకుంది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ, అసాధారణమైన కలలు, ఆశయాలు కలిగిన పాత్రకు ఆమె చక్కగా సరిపోయారు. శ్రుతి హాసన్ ఈ ప్రాజెక్ట్‌కు మరింత స్టార్‌డమ్‌ను తీసుకొస్తున్నారు.
 
భావోద్వేగాలను ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడంలో గుర్తింపు పొందిన దర్శకుడు పవన్ సాధినేని, ఈ భావోద్వేగభరితమైన కథకు సంబంధించిన ఆకట్టుకునే టీజర్‌ను అందించారు. డ్రామా,  హృదయాన్ని తాకే భావోద్వేగాలు, స్ఫూర్తినిచ్చే సందర్భాలను చక్కగా సమతుల్యం చేస్తూ కథనాన్ని హృద్యంగా  మలిచారు.
 
సుజిత్ సారంగ్ గ్రామీణ జీవితంలోని సహజత్వాన్ని తన కెమరాలో అద్భుతంగా బంధించారు. జి.వి. ప్రకాశ్ కుమార్  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో భావోద్వేగాల ప్రభావాన్ని మరింత పెంచారు. ప్రొడక్షన్ డిజైనర్ శ్వేత సాబు సిరిల్ అందించిన అద్భుతమైన పనితనం సినిమా విజువల్ ను మరింత పెంచుతోంది.
ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
 
‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
 
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ తదితరులు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్‌ చిత్రం స్లమ్ డాగ్ షూటింగ్ పూర్తి.. త్వరలోనే రిలీజ్ డేట్