1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Television producers who established TOPCOS

Television producers: టాప్కోస్ ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

A. Prasad Rao, Uday Shankar, and comity
A. Prasad Rao, Uday Shankar, and comity
గత రెండేళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల టెలివిజన్ నిర్మాతలతో ఎన్నోసార్లు చర్చించి, చివరగా జనవరి 2026లో చెన్నైలో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి మీటింగ్ నిర్వహించుకుని ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కావలసిన అన్ని ప్రక్రియలు రిజిస్ట్రేషన్, బైలాస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులతో కలిసి ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’సంస్థ అధికారికంగా ఏర్పరిచారు. ఈ టాప్కోస్ కు సంబంధించిన వివరాలను అన్నిటినీ తెలియజేశారు.
 
 
మరి ఈ సందర్భంగా టాప్కోస్ అధ్యక్షుడు ఏ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. మొత్తం 17మందితో ఒక అడ్ హాక్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి రిజిస్ట్రేషన్ చేయడం కోసం చాలా కష్టపడ్డాం. మాకు దీనికి ఏ గైడ్ లైన్స్ లేదు. సౌత్ ఇండియన్ టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు ఒక చట్ట ప్రకారం తయారు చేయడానికి మార్గదర్శకమైన గైడ్ లైన్స్ లేదు. మా నుంచి ప్రతి సమస్య, ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషించుకుని.. దాని నుంచి కార్యాచరణ రూపొందించుకుంటూ ప్రతి సమస్యను సునిశితంగా పరిశీలించి అనేక చర్చల తర్వాత ఒక బై లా తయారు చేసుకోవడం జరిగింది. ఈ బై లా మొట్టమొదటి సారిగా టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 
 
నాలుగు రాష్ట్రాల నిర్మాతల సంక్షేమం, వారి హక్కులు, బాధత్యలను గుర్తు చేస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ.. ప్రభుత్వాలను కూడా రిప్రజెంట్ చేస్తూ.. సౌత్ ఇండియన్ టివి, ఓటిటి ఇండస్ట్రీ పర్ఫెక్ట్ గా, ప్రొడక్టివ్ గా నడవడానికి కోసం గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది మా టాప్కోసం ప్రధాన ఉద్దేశ్యం. దీనికి ఎదురయ్యే సవాళ్లన్నీ ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాం. టివి పరిశ్రమను సినిమా పరిశ్రమ నుంచి వేరు చేయడానికే మాకు మూడేళ్ల టైమ్ పట్టింది. ఇవాళ టివి పరిశ్రమ ఎంత గొప్పగానో ఎదిగింది. సినిమాల్లోని ఆర్టిస్టుల కంటే సీరియల్స్ లో ఉండే ఆర్టిస్టులను బాగా గుర్తు పడుతున్నారు. దాదాపు 15వేల మంది తెలుగు టివి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు. అంటే మిగతా భాషల నుంచి ఇంకా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పెద్ద పరిశ్రమను పకడ్బందీగా నడిపించడం కోసం మేం నిర్మాతల మండళ్లు, టాప్కోస్ ను ఒక ఎజెండాగా తీసుకుని కృషి చేయడం జరుగుతుంది.  అని ముగించారు.
 
వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ గారు మాట్లాడుతూ, కర్ణాటకలో మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ తెలుగు ఇండస్ట్రీ చూసి మేం అవాక్కయ్యాం. వీళ్లు ఎంత బాగా ఈ అసోసియేషన్ నడిపిస్తారు అని చూసి మేం చాలా అసూయపడ్డాం. తర్వాత మేం సెక్రటరీని, ప్రెసిడెంట్ ను కలవాలని ప్రయత్నించాం. బెంగళూరులో కలవాలనుకున్నాం. కానీ ఆ టైమ్ లో మా మీటింగ్ సక్సెస్ కాలేదు. కానీ తర్వాత మళ్లీ కలుసుకున్నాం. ప్రసాద్ గారి వల్ల మళ్లీ ఇది సాధ్యం అయింది. అందరం కలిసి ఈ ప్రయాణాన్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం..’అన్నారు.
 
కేరళ నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణన్ సేతుకుమార్ మాట్లాడుతూ, మేమంతా కలిసి ఈ కౌన్సిల్ ముందుకు తీసుకువెళ్లడానికి, టెలివిజన్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకోసం ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నా..’ అన్నారు.
 
చెన్నై నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ నుంచి రాజా వేలు మాట్లాడుతూ.. ‘మాకు చెన్నైలో ఎప్పుడూ చెప్పేవారు.. హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చాలా బాగా చేస్తున్నారు అని. అది విన్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది.. వాళ్లు చాలా ఆర్గనైజ్డ్, చాలా డిసిప్లిన్డ్ అని. ఇది మాకు చెన్నైలో కనిపించేది కాదు. ఆ కారణంగా ప్రసాద్ గారు అలాగే మీ టీమ్ నుంచి చాలా స్ఫూర్తి తీసుకున్నాం. పాఠాలూ నేర్చుకున్నాం. మేమెళ్లి  రీ కన్ స్ట్రక్ట్ చేశాం. అలాగే మా దగ్గర యాక్టర్స్ చాలా సమస్యలు ఉన్నాయి. సగం పని ఇక్కడ నుంచి వేరే చోట సగం పని చేయడం చూస్తున్నాం. దీనివల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నాం. ఈ మొత్తాన్ని ప్రసాద్ గారితో పాటు మిగతా నిర్మాతలతో కలిసి మాట్లాడిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాం. అందులో నుంచి పుట్టిందే ఈ కౌన్సిల్. ఇక ముందు కూడా ఇలాగే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా..’అన్నాడు. 
About Writer
దేవీ
తర్వాతి కథనం
Samantha మా ఇంటి బంగారం చూస్తే మీ డబ్బు, సమయానికి నేను హామీ : సమంత