శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (15:20 IST)

ప్రశాంతి హారతితో చేయబడ్డ తెలుగింటి సంస్కృతి మ్యూజిక్ వీడియోకు ఆదరణ

Prashanthi Harathi,Tanya Harathi
Prashanthi Harathi,Tanya Harathi
పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో  కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి హారతి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. అక్కడ ఆమె ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. ప్రశాంతి హారతి దగ్గరే ఆమె కూతురు తాన్య హారతి కూచిపూడి డాన్స్ నేర్చుకుంది. తాన్య హారతి ప్రధాన పాత్రలో తెలుగింటి సంస్కృతి పేరుతో మ్యూజిక్ వీడియోకు ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య కాన్సెప్ట్ తయారుచేసి రూపొందించారు.
 
కిరణ్ గుడిపూడి ఈ వీడియోలో మరో లీడ్ రోల్ చేశారు. ఇటీవలే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేసిన తెలుగింటి సంస్కృతి  మ్యూజిక్ వీడియోకు లక్షలాది వ్యూస్ వస్తున్నాయి. రాధాకృష్ణ హారతి నిర్మాతగా వ్యవహరించారు. మురళి రుద్ర,  అన్వేష్ మావిళ్ళపల్లి, ఆనంద్ పవన్ నాయుడు ఎడిటర్స్ గా పనిచేసిన తెలుగింటి సంస్కృతి  వీడియోకు ఎస్ ఎ ఖుద్దూస్ సంగీతం అందించగా..శ్రీ రామ్ తపస్వి గీత రచన చేశారు.  ప్రముఖ నేపధ్య గాయని శ్రీనిధి పాడిన ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.