శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి

''మాస్టర్'' సీన్స్ లీక్.. ఆ పని చేసిందెవరో తెలుసా?

తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా విడుదలకు ముందే లీక్ కావడం సంచలనంగా మారింది. జనవరి 13న దాదాపు 2000 థియేటర్స్‌లో విడుదలవుతుంది మాస్టర్ సినిమా. తెలుగులో కూడా ఈ సినిమా భారీగానే వస్తుంది. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. అయితే మాస్టర్ లీక్ ఘటనతో దర్శక నిర్మాతలతో పాటు అంతా తలలు పట్టుకున్నారు. 
 
అసలు ఎవరు చేశారని కంగారు పడుతున్నారు. లీక్ అయిన సన్నివేశాలు బయటికి మరింత స్ప్రెడ్ చేయొద్దు అంటూ వేడుకున్నారుదర్శకుడు లోకేష్ కనకరాజ్. ఏడాదిన్నర కష్టపడిన సినిమాను ఇలా చూడొద్దు అంటూ ప్రాధేయపడ్డాడు. 
 
అసలు విడుదలకు ముందు సినిమా ఎలా బయటికి వచ్చింది అంటూ ఆరా తీస్తే మాస్టర్ లీక్ వెనక ఉన్నది ఎవరో తెలిసిపోయింది. ఈ సినిమా సన్నివేశాలను లీక్ చేసింది ఎవరో కాదు.. ఓ థియేటర్ ఉద్యోగి. నమ్మడానికి చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. చెన్నైలో ప్రతిష్టాత్మకమైన ఎస్డీసీ థియేటర్‌కు మాస్టర్ సినిమా ప్రింట్ వచ్చింది. అక్కడికెందుకు ప్రింట్ వచ్చింది అనుకుంటున్నారా..? థియేటర్‌కు వచ్చిన ప్రింట్ నుంచే ఈ సినిమా సన్నివేశాలు లీక్ అయ్యాయని తెలిసింది.
 
దీంతో చిత్ర యూనిట్‌ సదరు ఉద్యోగిపై కంప్లైంట్‌ ఇచ్చారు. ఆ ఉద్యోగితో పాటు కంపెనీపై కూడా లీగల్‌ చర్యలు తీసుకోడానికి చిత్రయూనిట్ సిద్ధమైంది. ఏదో సరదా కోసం చేసిన పని దేశమంతా సంచలనం అయిపోయింది.