బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 జులై 2023 (17:41 IST)

నాకు తెలియని కుటుంబం నాకు అవసరం: సమంత

Samantha Prabhu with Citadel team
Samantha Prabhu with Citadel team
సమంత ఇక పై సినిమాలు చేయదు అని ప్రచారం జరిగిన మాట వాస్తవమే అయినా నేడు షూటింగ్ లో పాల్గొని  నాకు తెలియని కుటుంబం నాకు అవసరం అని  సమంత కొటేషన్ పెట్టింది. ఈరోజు తో తాను చేసిన వెబ్ మూవీ సిటాడెల్ షూట్ పూర్తి అయింది.  ఈ సందర్భంగా యూనిట్ తో ఫోటో పెట్టి ఆనందాన్ని వెలిబుచ్చింది. అంతే కాక  ఏమి జరుగుతుందో తెలిసినప్పుడు విరామం అనేది బాడ్ విషయంగా అనిపించదు అంటోంది. 
 
నేను చేస్తున్న  యుద్ధంలో పోరాడటానికి నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. వారు ఎప్పుడూ నన్ను వదులుకోలేదు అని సిటాడెల్ యూనిట్ తో ఫోటో దిగి స్పందించింది. సమంత ఇప్పటికే నరాలకు సంబందించిన చిత్రమైన వ్యాధితో బాధపడుతుంది. అందుకు ఈఏడాది పాటు విశ్రాంతి అవసరం అని ప్రకటించింది. కానీ పెండింగ్ వర్క్ పూర్తి చేసి అందరు తనకు సపోర్ట్ గా ఉన్నారనే హింట్ ఇచ్చింది. ఇటీవలే విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా పూర్తి చేసింది. ఇదే ఆమె విశ్రాంతి ముందు నటించిన పెద్ద సినిమా.