ఆదివారం, 23 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 22 మార్చి 2025 (19:59 IST)

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Jayasudha, Amani, Harish Shankar, Meher Ramesh, Thaman and others
Jayasudha, Amani, Harish Shankar, Meher Ramesh, Thaman and others
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 8వ తెలుగు సంబరాలు ఈవెంట్ కు సిద్ధమవుతోంది. జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అమెరికాలోని టంపాలో జరగనున్నాయి. తాజాగా హైదరాబాద్ లో నాట్స్ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమ కర్టెన్ రైజర్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  తెలుగు సంబరాలు కాన్ఫరెన్స్ కన్వీనర్ అండ్ పూర్వపు చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలు అమెరికా నుండి విచ్చేసి మీడియా సమావేశం నిర్వహించారు.

నటి జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేష్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
 
ఈ కార్యక్రమంలో నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ - నాట్స్ అంటే సేవ, భాష ..ఈ రెండు పదాలు గుర్తుకువస్తాయి. అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలబడేందుకు 2009లో ఈ ఆర్గనైజేషన్ ను స్థాపించాం. మనకు ఇక్కడ ఏదైనా ఆపద వస్తే స్నేహితులు, బంధువులు ఉంటారు. కానీ అమెరికాలో ఉన్న తెలుగువారికి ఎవరూ ఉండరు. వారికి ధైర్యాన్ని ఇస్తూ అండగా నిలబడుతోంది నాట్స్. తెలుగువారు ఎక్కడున్నా వారికి నాట్స్ అండగా ఉంటోంది. నాట్స్ అంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం. మన భాష రేపటి తరాలకు అందాలి, వారు మన భాషను తెలుసుకోవాలి. అలాగే ఆపద వస్తే ఆదుకునేందుకు చేయూత ఇవ్వాలి..ఇలాంటి లక్ష్యాలతో నాట్స్ ను కొనసాగిస్తున్నాం. మా సంస్థ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు కవులు, కళాకారులు, నటీనటులు, ఇతర రంగాల ప్రముఖు హాజరుకాబోతున్నారు. మా సభ్యులు కమిటీలుగా 300మంది ఈ ఈవెంట్ కోసం పనిచేస్తున్నారు. 10 వేల మంది తెలుగు సంబరాలు కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. రాబోయో 15 ఏళ్ల వరకు మా నాట్స్ సంస్థ ఎలాంటి అభివృద్ధి దిశలో మరింత సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలో ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ మాట్లాడుతూ - ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన అతిథులు అందరికీ నమస్కారం. తెలుగు భాష చాలా గొప్పది, అలాంటి భాషను కాపాడుకుంటూ మన సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాలకు అందిస్తూ వెళ్లాలనే ప్రయత్నం నాట్స్ ద్వారా చేస్తున్నాం. మేము చేసే సేవా కార్యక్రమాలకు అందరి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందు ముందు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. మన నాట్స్ సంస్థ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమం నభూతో న భవిష్యతి అనేలా చేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో మీరంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం. మనం దసరా దీపావళి ఎలా జరుపుకుంటామో, ఈ తెలుగు సంబరాలు కార్యక్రమాన్ని కూడా పండగలా సెలబ్రేట్ చేసుకుందాం అన్నారు.
 
నటి జయసుధ మాట్లాడుతూ - నాట్స్ అంటే సంబరాలు మాత్రమే కాదు సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్. నాట్స్ గత తెలుగు సంబరాలకు కూడా నన్ను ఆహ్వానించారు. అయితే మా మదర్ చనిపోవడం వల్ల వెళ్లలేకపోయాను. ఈ సారి తప్పకుండా వెళ్తాను. ఇటీవల నేను ఇంగ్లీష్ మూవీలో నటించాను. ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు నాట్స్ తెలుగు సంబరాలు జరిగే ప్లేస్ కు దగ్గరలోనే జరిగింది. నాట్స్ ఈవెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ - నాట్స్ గత తెలుగు సంబరాలు ఈవెంట్ లో నేను పాల్గొన్నాను. ఇప్పుడు సెకండ్ టైమ్ వారికి కన్సర్ట్ చేయబోతున్నా. నాతో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా కన్సర్ట్ లో పాల్గొంటాడు. సంగీత విభావరితో పాటు జూలై 1,2,3 తేదీల్లో క్రికెట్ టోర్నమెంట్ ఆడబోతున్నాం. నాట్స్ 11 టీమ్ మేము మరో టీమ్ పోటీ పడుతున్నాం. అఖిల్, సుధీర్ బాబు..ఇలా మా టీమ్ అంతా మ్యాచ్ కు రెడీ అవుతున్నాం. నేను నాట్స్ తో అసోసియేట్ అవడానికి కారణం ప్రశాంత్ గారు, శ్రీనివాస్ గారు. వాళ్లు మమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. ఈసారి ఈవెంట్ మరింత బాగా జరగాలి. అన్నారు.
 
దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ - ప్రశాంత్ గారు, శ్రీనివాస్ గారు నాకు మంచి స్నేహితులు. వారు ఫోన్ చేయగానే నాట్స్ ఈవెంట్ కు వస్తున్నా అని చెప్పా. తెలుగు భాషకు, మన సంస్కృతీ సంప్రదాయాలకు వీరి చేస్తున్న సేవ అద్భుతం. తెలుగు వారు ఎక్కడున్నా వారికి  సపోర్ట్ గా నిలబడుతున్నారు. ఇలాంటి ఆర్గనైజేషన్ ఎంతో ముందుకు వెళ్లాలి. మరింతగా తెలుగు వారికి అండగా ఉండాలి. అన్నారు.
 
డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ - నాట్స్ సంస్థ లోగోలోనే భాష, సేవ ఉన్నాయి. ఇదొక గొప్ప ఆర్గనైజేషన్. ఈ సంస్థ కోవిడ్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. వారి ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. అన్నారు.
 
లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ - తెలుగు భాషను కాపాడటమే కాదు ముందు తరాలకు అందేలా చూస్తున్నా నాట్స్ వారికి ధన్యవాదాలు. నాట్స్ తెలుగు సంబరాలు కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను. రామజోగయ్య గారితో కలిసి ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. అన్నారు.
 
లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ - తెలుగు వారి కోసం, తెలుగు భాష కోసం నాట్స్ గొప్ప కార్యక్రమాలు చేస్తోంది. వారికి నా ప్రశంసలు అందిస్తున్నా. నాట్స్ తెలుగు సంబరాలు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్నారు.
 
నటి ఆమని మాట్లాడుతూ - నాట్స్ తెలుగు సంబరాలు కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నేను తప్పకుండా వస్తానని చెప్పాను. నాట్స్ వంటి పర్పస్ ఫుల్ ఆర్గనైజేషన్ మరింత విస్తృతంగా సేవలు అందించాలి. అన్నారు.