1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. This Is The Reason Behind Rajini US Trip

ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లిన రజనీకాంత్

Rajinikanth
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక విమానంలో అమెరికాకు బయలుదేరి వెళ్లారు. శనివారం వేకువజామున 4 గంటల సమయంలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి ఈ విమానంలో వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత ఆయన మూడు నెలల పాటు అమెరికాలో విశ్రాంతి తీసుకోనున్నారు. 
 
గత 2011లో కిడ్నీ సంబంధిత సమస్యకు సింగపూర్‌లో రజనీకాంత్ వైద్యం చేయించుకున్న విష‌యం తెలిసిందే. అనంత‌రం అమెరికా వెళ్లి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కిడ్నీ చికిత్స చేయించుకుని పదేళ్లు కావడంతో ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్తున్నారు. 
 
ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్.. శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కరోనా వైరస్ రెండో ద‌శ విజృంభ‌ణ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో నయనతార, ఖుష్బూ, మీనా, జగపతి బాబు, కీర్తి సురేశ్ న‌టిస్తున్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
స్టాలిన్‌కు రెండు కోట్ల విరాళం అంద‌జేసిన లైకా సంస్థ