శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2016 (15:34 IST)

12న గుంటూరులో వైభవంగా 'అ..ఆ...' విజయోత్సవ వేడుక

మాటల మాంత్రికుడు, దర్శకుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్‌లతో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన 'అ..ఆ...' చిత్రం ఘన విజ

మాటల మాంత్రికుడు, దర్శకుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్‌లతో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన 'అ..ఆ...' చిత్రం ఘన విజయం సాధించిన విషయం విదితమే. 
 
ఈ చిత్రం సాధించిన ఘన విజయం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 12న గుంటూరులో 'అ..ఆ...' విజయోత్సవ వేడుకను జరుపనున్నట్లు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన గుంటూరులోని 'సిద్ధార్ధ గార్డెన్స్'లో ఆదివారం (జూన్ 12) సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ విజయోత్సవ వేడుక జరుగనుంది.
 
ఇందులో మాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' హీరో నితిన్, సమంత, అనుపమ, నదియ, నరేష్, రావు రమేష్ ,అజయ్, హరితేజ, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, మధునందన్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్యలతో పాటు పలువురు నటీ నటులు, సాంకేతిక నిపుణులు, పలువురు రాజకీయనాయకులు పాల్గొంటున్నట్లు నిర్మాత తెలిపారు.