మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (13:15 IST)

ట్ర‌క్ న‌డ‌ప‌డం లైఫ్‌లో కొత్త అనుభూతిః ర‌కుల్‌

Rakul driving
న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ ట్ర‌క్‌ను న‌డిపి జీవితంలో ఇదో గొప్ప అనుభూతి అంటూ పోస్ట్ చేసింది. ఇటీవ‌లే ట్ర‌క్ న‌డిపే స‌న్నివేశాన్ని పంజాబ్‌లో చేసింది. నెట్‌ఫ్లిక్స్ కోసం తీస్తున్న‌ `సర్దార్ కా గ్రాండ్‌సన్‌` సినిమాలో ఆమె న‌టిస్తోంది. క‌థ ప్ర‌కారం పంజాబీ కుర్రాడు (అర్జున్ కపూర్) క‌థ‌. తన బామ్మ (నీనా గుప్తా) చివరి కోరికను తీర్చడానికి అత‌ను ఏం చేశాడ‌న్న‌ది క‌థ‌. ఇందులో రాధ పాత్ర‌లో ర‌కుల్ న‌టిస్తుంది. సెన్సిబుల్ అమ్మాయిగా త‌ను న‌టిస్తోంది.
 
వ్య‌క్తిగ‌తం నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ట్ర‌క్ న‌డ‌పడం అంత సులువుకాదు. కానీ పూర్తి ప‌ట్టుద‌ల‌తో చేయ‌డంతో అది సాధ్యం అంటూ చెబుతోంది. తారాగణానికి శిక్షణ ఇవ్వడానికి మేకర్స్ ట్రక్ డ్రైవర్‌ను సెట్‌లో ఉంచారు. ర‌కుల్‌ డ్రైవింగ్ నైపుణ్యం చూసి సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారని రకుల్ అన్నారు. "ఇది నాకు జీవితకాలపు అనుభవంలో ఒకసారి ఉంది` అని తెలుపుతోంది. 
ఈ సినిమాలో జాన్ అబ్రహం, అదితి రావు హైడారి, కుముద్ మిశ్రా కూడా నటించారు. ఈ చిత్రానికి కాశ్వి నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మే 18 న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధ‌మ‌వుతోంది.
 
కాగా, ర‌కుల్ న‌డుపుతున్న ట్ర‌క్ స్టిల్ ఇటీవ‌లే అల్లు అర్జున్ `పుష్ప‌` సినిమాలో అల్లు అర్జున్ న‌డిపిన సంద‌ర్భాన్ని గుర్తు చేస్తోంది అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు.