సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (18:38 IST)

సుశాంత్ ప్రియురాలి కాల్ లిస్టులో టాలీవుడ్ హీరో - హీరోయిన్ పేర్లు!! (Video)

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కోట్లాది రూపాయల నగదును సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి బదిలీ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు గుర్తించారు. ఇదే అంశంపై సుశాంత్ ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తితో పాటు వారి కుటుంబ సభ్యులను విచారించారు. అలాగే రియా మొబైల్ కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఈడీ విచారణలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పలు విషయాలను వెల్లడించింది. రియాకు సంబంధం ఉన్నవారి వివరాలను ఈడీ సేకరిస్తోంది. ఇంతవరకు సుశాంత్ మరణంపై ఖాన్ త్రయం అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు నోరు మెదపని సంగతి తెలిసిందే. అయితే రియా కాల్ డేటాలో అమీర్ ఖాన్ పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. అమీర్‌కు రియా ఒక సారి ఫోన్ చేయగా... ఆయన నుంచి మూడు మెసేజ్‌లు వచ్చాయి.
 
మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు రియా 30 సార్లు ఫోన్ చేసింది. రియాకు రకుల్ 14 సార్లు కాల్ చేసింది. దగ్గుబాటి రానాకు కూడా రియా 7 సార్లు ఫోన్ చేయగా... ఆమెకు రానా 4 సార్లు కాల్ చేశాడు. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌కు రియాకు మధ్య కూడా ఫోన్ సంభాషణలు నడిచాయి. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.