మిహికాకు 10 వేల గంటలు శ్రమించి లెహంగా తయారీ!!
తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకటైన దగ్గుబాటి రానా శనివారం ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో తన ప్రియురాలు మిహికా బజాజ్‌తో కలిసి ఏడడుగులు వేశాడు. పెళ్ళికి వచ్చిన అతిథులు నూతన దంపతులకి ఆశీర్వచనాలు అందించారు. హైదరాబాద్ నగరంలోని రామానాయుడు స్టూడియోలో రానా - మిహికాల వివాహ వేడుక జరగింది.
అయితే, పెళ్లిలో మిహికా ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిన గోల్డ్ మరియు క్రీమ్ కలర్ లెహంగాను ధరించారు. రానా గోల్డ్ కలర్ ధోతి ధరించాడు. చూడముచ్చటగా ఉన్న ఈ జంటకి అభిమానులు, సినీ ప్రేక్షకులు శుభాకాంక్షలు అందించారు. పెళ్ళిలో వెంకటేష్, నాగ చైతన్య, సమంత, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ సందడి చేశారు.
అయితే, ఈ చాలా మంది దృష్టి ఈ పెళ్లికంటే.. మిహికా ధరించిన లెహంగాపైనే పడింది. గోల్డ్ మరియు క్రీమ్ కలర్‌లో ఎంతో అందంగా ఉన్న లెహంగా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ లెహంగాపై ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
మిహికా ధరించిన లెహంగాని ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేయగా, దీనికోసం సుమారు పది వేల గంటల సమయం పట్టిందట. లెహంగాలో జర్దొసి డిజైన్లను చికంకరి మరియు బంగారు లోహంతో చేశారట. ఇంక లెహెంగా కోసం బంగారు నేసిన దుపట్ట కూడా ఉంది.
ఈ డ్రెస్‌లో మిహికా ఎంతో అందంగా కనిపిస్తుండగా, ఆమె రానాకి సరైన జోడు అని నెటిజన్స్ చెబుతున్నారు. రానా- మిహికా పెళ్లి రామానాయుడు స్టూడియోలో సింపుల్‌గా జరిగింది. అంతక ముందు హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. మే 20న వీరి నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే.