శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (12:47 IST)

కర్నూలు: వధువుకు కరోనా పాజిటివ్... ఆగిన పెళ్లి

కరోనా విజృంభిస్తోంది. ఈ కరోనా కారణంగా వివాహాలు వాయిదా పడుతున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో చోటు జరిగింది. పెళ్లి తంతులో భాగంగా గురువారం పెండ్లి కుమారుడిని చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంతలో అతడికి కరోనా పాజిటివ్‌ అంటూ రిపోర్టు వచ్చింది. దీంతో పెళ్లిని వాయిదా వేశారు. 
 
తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలులో చోటుచేసుకుంది. పెళ్లికూతురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పెళ్లి వాయిదా పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణం చెంచు కాలనీకి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చమైంది.
 
ఈ నెల 25న పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కోవిడ్‌ నిబంధనల ప్రకారం వివాహానికి మూడు రోజుల ముందు వధూవరులు ఇద్దరు కోవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. శనివారం పెళ్లి జరగాల్సి ఉండగా.. ఉదయం పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్‌ అని రిపోర్టులు వచ్చాయి. దీంతో అధికారులు హుటాహుటీన ఆ యువతి ఇంటికి చేరుకుని విషయం చెప్పారు. 
 
దీంతో ఇరు కుటుంబాలు చర్చించుకుని చేసేది లేక వివాహాన్ని వాయిదా వేశాయి. ఇక నందికొట్కూరులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 22న కోట హైస్కూల్‌ వద్ద 378 మంది పరీక్షలు చేస్తే.. 100 మందికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది.