ఏం.. ప్రభుదేవా విడాకులు ఇవ్వకుండానే నయనతారతో సహజీవనం చేయలేదా? (Video)
కోలీవుడ్ సీనియర్ నటుడు విజయకుమార్ - మంజుల దంపతుల కుమార్తె వినీత విజయకుమార్. ఈమె సినీ నటి కూడా. బిగ్ బాస్ -3 ఫేమ్. అయితే, ఈమె ఇటీవల మూడో పెళ్లి చేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో పాటు.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తన కుమార్తెల సమ్మతంతోనే మూడో పెళ్లి చేసుకుంటున్నట్టు వినీత ప్రకటించింది. అయితే, ఈ పెళ్లిపై కోలీవుడ్‌లో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని కేంద్రంగా చేసుకుని సోషల్ మీడియాలో అనేక మంది ఆమెను ఓ ఆటాడుకున్నారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తోన్న విమర్శలకు ఆ మాధ్యమం ద్వారా సమాధానం చెబుతోన్న ఆమె.. సినీ నటి నయనతార వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించింది. ప్రముఖ కొరియోగ్రాఫర్, సినీ దర్శకుడు, నటుడు ప్రభుదేవా కూడా గతంలో తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే నయన తారతో సహజీవనం చేశాడని ఆమె గుర్తు చేసింది.
దీంతో ప్రభుదేవా భార్య రమాలతతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు ఎన్నో కష్టాలు అనుభవించారని చెప్పుకొచ్చింది. అప్పట్లో ఈ విషయంపై ఒక్క మాట మట్లాడని వారు, తన మూడో పెళ్లి గురించి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె సూటిగా ప్రశ్నించింది. దీంతో ఆమెపై నయనతార ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వనితపై మండిపడ్డారు. ఈ విమర్శలను భరించలేక వనిత చివరకు తన ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా మూసివేసింది.