శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (19:26 IST)

శింబు మాజీ ప్రియురాలికి సొంతూరులోనే వివాహం??? (Video)

ఇటు తెలుగు, అటు తమిళంలోనే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న భామ నయనతార. అయితే, ఈమె కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న సమయంలో ఈమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. తొలుత కోలీవుడ్ యువ హీరో శింబు, ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. కానీ వీరిద్దరితో ప్రేమ విఫలమైంది. 
 
ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో వుంది. వీరిద్దరూ వివాహం చేసుకోలాని నిర్ణయించుకున్నారు. అయితే, కొన్నిరోజుల ముందు వీరి వివాహం తమిళనాడులో జరగనుందని వార్తలు వినిపించాయి. కానీ, తాజా స‌మాచారం మేర‌కు న‌య‌న‌తార వివాహం త‌మిళ‌నాడులో కాదు.. కేర‌ళ‌లోని ఓ అమ్మ‌వారి గుడిలో జ‌ర‌గ‌నుంద‌ట‌. అయితే న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ జోడీ మాత్రం ఈ వార్త‌ల‌పై స్పందించాల్సి వుంది.