శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (23:23 IST)

కరోనా ఎఫెక్ట్.. నిరాడంబరంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మనవరాలి వివాహం

Princess Beatrice
ప్రిన్సెస్ బ్రీట్రైస్, మాపెల్లి మొజ్జీల వివాహం, జూలై 17న శుక్రవారం ఉదయం 11 గంటలకు విండ్సర్‌లోని రాయల్ లాడ్జ్‌లోని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద జరిగినట్లు రాజ కుటుంబం తెలిపింది. 
 
కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ విహహం జరిగినట్లు తెలుస్తోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మనవరాలు, ప్రిన్స్ ఆండ్రూ పెద్ద కుమార్తె ప్రిన్సెస్ బీట్రైస్ వివాహం చేసుకున్న వ్యక్తి ఇటలీకి చెందిన వారు. 
 
కరోనా కారణంగా వీరి వివాహం శుక్రవారం రోజు నిరాడంబరంగా జరిగింది. ఈ విషయాన్ని బకింగ్‌హమ్ ప్యాలెస్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. వీరి వివాహాన్ని మే 29న సెంట్రల్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిపించాలని మొదట నిర్ణయించారు. కానీ కరోనా నేపథ్యంలో వీరి వివాహం వాయిదా పడింది.