శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జులై 2020 (12:57 IST)

జూలై 26న నితిన్ వివాహం.. వధువు ఇంట్లోనే పెళ్లి?

యువ హీరో నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దేలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఆయనకు జంటగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నితిన్ చంద్రశేఖర్ యేలేటీ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు. హిందీలో సూపర్ హిట్టైనా అంధాధున్‌ తెలుగు రీమేక్‌లో కూడా నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తోంది.
 
ఈ నేపథ్యంలో నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. కరోనా కారణంగా జూలై 26న వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. నితిన్ ఇటీవల తన గర్లఫ్రెండ్ శాలినితో నిశ్చి తార్థం చేసుకున్నాడు. ఇక పెళ్లిని ఘనంగా చేసుకోవాలనీ భావించిన నితిన్ మొదట దుబాయ్‌‌లో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని భావించాడు. 
 
అయితే కరోనా కారణంగా అలా వేసుకున్న ప్లాన్ ముందుకు సాగలేదు. ఇక చేసేందేం లేక నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించాడు. కానీ తాజా సమాచారం ప్రకారం నితిన్ తన పెళ్ళిని ఈ నెల 26న చేసుకోనున్నాడని సమాచారం. అంతేకాదు ఈ వివాహం హైదరాబాద్‌‌లో వధువు ఇంటి వద్దే జరుగునుందట.