గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (10:57 IST)

'కృష్ణ అండ్ హిజ్ లీల'కు చిక్కు.. దేవుళ్ల పేరు వాడుకుంటారా?

Krishna and his leela
'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాకు చిక్కు వచ్చి పడింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రం గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పెరెపు తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వాడ్నికట్టి హీరోయిన్లుగా నటించారు. రానా దగ్గుబాటి చిత్రాన్ని సమర్పించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. తాజాగా చిత్రానికి సంబంధించి రాకేష్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు.
 
చిత్రంలో ప్రధాన నటులకి హిందూ దేవతల పేర్లను ఉపయోగించినందుకు రాకేశ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో 'కృ ష్ణ అండ్ హిజ్ లీల' చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం పూర్తి శృంగారభరిత చిత్రంగా తెరకెక్కగా ఇందులో సిద్ధు ముగ్గురు హీరోయిన్‌లతో ప్రేమాయణం సాగిస్తాడు. పాత్రలందరికి దేవుళ్లపేర్లు పెట్టి రొమాన్స్ నడిపించినందుకు రాకేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ సినిమాకు కొత్త చిక్కు వచ్చి పడింది.