సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (16:43 IST)

రామ్ గోపాల్ వర్మ ''మర్డర్'' నుంచి మరో పోస్టర్.. అమృత బాబుతో..?

Murder
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్యోదంతం ఆధారంగా 'మారుతి రాసిన అమృతప్రణయ గాథ' అంటూ సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు విడుదల చేసిన వర్మ శుక్రవారం ఈ చిత్రం నుంచి మరో పోస్టరును విడుదల చేశారు. ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేపేలా వర్మ పోస్టర్లు విడుదల చేస్తున్నారు.
 
ఈ పోస్టర్‌లో అమృత  తన కుమారుడిని ఎత్తుకుని ఉన్నట్లు ఉంది. ప్రణయ్ పరువు హత్యకు గురికావడం, అమృత తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వంటి సన్నివేశాలతో యధార్థ కథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు వర్మ తెలిపిన విషయం తెలిసిందే. ప్రయణ్ చనిపోయిన తర్వాత అమృతకు మగబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. ఆర్జీవీ ఇప్పటికే విడుదల చేసిన మర్డర్ మూవీ ఫస్టు లుక్ పోస్టరుపై అమృత మండిపడింది. తన కథ పేరుతో రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ మూవీకి తన రియల్ లైఫ్‌కి ఏ సంబంధం లేదని అమృత స్పష్టం చేసింది. అయినా అమృత వ్యాఖ్యలను వర్మ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోతున్నాడు. ప్రస్తుతం మర్డర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. ఓటీటీలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు.