ఫ్రస్టేషన్‌లో పెళ్లాలను కొడుతున్నారన్న ఆర్జీవీ.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన కేటీఆర్
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం బంద్ అయింది. కేంద్ర ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రబుత్వాలు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి. ఒక్క అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలన్నీ బంద్ అయ్యాయి. అలాగే, పేదోడి నుంచి ధనవంతుడు వరకు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇక సెలెబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు.
ఇంటితో పాటు... ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో మునిగిపోయారు. అలాంటివారిలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఒకరు. ప్రతి రోజు ఏదో ఒక విచిత్ర ట్వీట్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంటాడు.
తాజాగా ఆయన కేసీఆర్, కేటీఆర్, వైఎస్.జగన్‌లని ట్యాగ్ చేస్తూ ఒక విజ్ఞప్తి చేశాడు. లాక్‌డౌన్ కారణంగా మద్యం షాపులు అన్నీ మూతపడ్డాయి. దీంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు పిచ్చోళ్లు అయిపోతున్నారు.
పిల్లలులా ఏడుస్తున్నారు. ఫ్రస్ట్రేషన్‌తో పెళ్ళాలని కొడుతున్నారు ఇంకొందరు జుట్టు పీక్కుంటున్నారు. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ చేసినట్లు ఆ మందు ఏదో ఇంటింటికి డెలివరీ చేసే మార్గం చూడండి అని రిక్వెస్ట్ చేశారు వర్మ.
వర్మ చేసిన ట్వీట్‌కి కేటీఆర్ తనదైనస్టైల్‌లో పంచ్ ఇచ్చారు. రాము మీరు మాట్లాడేది హెయిర్ కటింగ్ గురించే కదా, నేను చేసేది కాదు అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. వర్మకి కేటీఆర్ ఇచ్చిన పంచ్ అదిరిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.