బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్!

తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు ప్రభాస్ కాగా, మరొకరు నితిన్. ఇందులో హీరో నితిన్ వివాహం ఏప్రిల్ 16వ తేదీన జరగాల్సివుంది. కానీ, కరోనా లాక్డౌన్ కారణంగా అది వాయిదాపడింది. 
 
తన చిరకాల స్నేహితురాలు శాలినిని పెళ్లి చేసుకోవాలని నితిన్ నిర్ణయించుకుని, ఈ వివాహన్ని దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ఈ పెళ్లి వాయిదాపడింది. 
 
అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం నితిన్ సినిమా డిసెంబ‌రులో జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. విదేశాలకి ఇప్ప‌ట్లో వెళ్లే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో త‌మ ఫాంహౌజ్‌లోనే నితిన్ త‌న పెళ్లిని చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
తాజాగా "భీష్మ" చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన నితిన్ .. కరోనా అనంతరం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' చిత్రం షూట్‌ను చేయనున్నారు. ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు.