గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (18:45 IST)

మరదలిపై బావ లైంగిక దాడి.. బలవంతంగా తాళికట్టి..?

మరదలిపై ఓ బావ నరకం చూపించాడు. బావ ఆగడాలను భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని కటక్ ప్రాంతానికి చెందిన రవి అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. ఆమెకు ఒక చెల్లెలుంది. పెళ్లయ్యే నాటికి చెల్లెలి వయసు 15 ఏళ్లు. పెళ్లి తర్వాత భార్య అనారోగ్యానికి గురికావడంతో.. రవి ఇంటి పనులు చేసేందుకు ఆమె చెల్లెలిని ఇంటికి తీసుకెళ్లేవాడు. 
 
అయితే ఇంటికి వచ్చిన మరదలిపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడటం ప్రారంభించాడు. అక్క కోసం అంతా భరించింది. కానీ గత వారం బాధిత యువతికి రవి ఇంట్లోనే బలవంతంగా తాళికట్టి.. తన కామ కోరిక తీర్చమని పట్టుబట్టాడు. అయితే తనకు అక్కకు ఈ విషయం చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే రవి మాత్రం యువతి ఇష్టపూర్వకంగానే తాను పెళ్లి చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులతో చెప్పించాడు.
 
అయితే యువతిపై అకృత్యాలు పెరగడంతో సహనం నశించి పోలీసులను ఆశ్రయించింది. బావ చెర నుంచి తనను కాపాడమని వేడుకుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.