శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (18:22 IST)

యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. చివరికి గర్భం దాల్చడంతో..?

కరోనా వంటి ప్రాణాంతక వ్యాధులు భయపెడుతున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రాలేదు. మహిళలపై నేరాల సంఖ్య తగ్గలేదు. అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ యువకుడు యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. ఇంకా ఆ వీడియోను చూపెట్టి.. బెదిరించి లొంగదీసుకున్నాడు. అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. ఈ ఘటనపై యువతి ధైర్యం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాకు చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు కన్నేశాడు. ఇతడు తన స్మార్ట్‌ఫోన్‌లో వీడియో తీశాడు. అనంతరం.. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేశాడు. తాను చెప్పినట్లు వినకపోతే.. వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా యువతి గర్భం దాల్చింది. విషయం యువతి తల్లిదండ్రులకు చెప్పగా.. వారు యువకుడి పెద్దలతో మాట్లాడారు. వాళ్లు స్పందించకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే కేసు వాపసు తీసుకుంటే.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్నట్లు నటించి తరువాత.. ఆ గర్భానికి తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆ యువతిని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. మళ్లీ మోసపోయానని భావించి మరోమారు పోలీసులను ఆశ్రయించింది యువతి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.