శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (15:28 IST)

అమేజాన్ ప్రైమ్‌లో ఏడు భారతీయ సినిమాలు.. నెట్టింటో విడుదల.. ఇక పండగే

Penguin
కరోనా విజృంభించడంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్‌లో వున్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో సినిమాలు విడుదలకు నోచుకోవట్లేదు. సినిమా హాల్స్ తెరుచుకోలేని పరిస్థితుల్లో ఇప్పట్లో సినిమాలు విడుదలయ్యే పరిస్థితి కనిపించలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దృష్ట్యా దర్శకనిర్మాతలు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ వైపు అడుగులు వేస్తున్నారు. 
 
ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే అమితాబ్ నటించిన బాలీవుడ్ సినిమా 'గులాబో సితాబో' జూన్ 12న అమెజాన్‌లో విడుదల చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పడు అదేబాటలో మరో ఆరు సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమయ్యాయి.
 
ప్రఖ్యాత గణిత శాస్త్ర వేత్త శకుంతలా దేవి బయోపిక్‌లో విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్ర పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అను మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లెడ్ అబుందంటియా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకు రావాలని చేసినప్పటికి ఆ పరిస్థితి కనిపించడం లేదు దాంతో ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. 
 
అలాగే కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్‌ చిత్రం 'పెంగ్విన్‌'. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. నూతన దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు నిర్మించారు. ఇందులో గర్భవతి పాత్రలో కీర్తీ సురేష్‌ నటించారు. తాజాగా ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌‌లో రిలీజ్‌ చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు లాక్‌ డౌన్‌ కారణంగా థియేటర్లో రిలీజ్‌ కాకుండానే డిజిటల్లోకి వచ్చాయి.
 
ఆ సినిమాల సంగతికి వస్తే.. జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్ నటించిన పొన్ మగల్ వంధాల్ (తమిళం) అమేజాన్‌లో మే 29వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు జె.జె. ఫ్రెడరిక్ దర్శకుడు. అలాగే కన్నడ సినిమా లా కూడా అమేజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 26వ తేదీన విడుదల కానుంది. రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు తదితరులు నటించిన ఈ చిత్రానికి రఘు సమర్థ్ దర్శకుడు. 
French Biryani
 
అదేవిధంగా మరో కన్నడ సినిమా ఫ్రెంచ్ బిర్యానీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 24 విడుదల కానుంది. పన్నాగ భరణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటో బాష్ తదితరులు నటించారు. ఇంకా మలయాళంలో సుఫియాం సుజాతాయం అనే సినిమా కూడా అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ చిత్రంలో అదితి రావు హైదరీ, జయ సూర్య నటించగా, నరని పుజా షానవాస్ దర్శకత్వం వహిస్తున్నారు.